Mon Dec 23 2024 12:06:06 GMT+0000 (Coordinated Universal Time)
చెన్నైకి వరసగా నాలుగో ఓటమి
చెన్నై సూపర్ కింగ్స్ వరసగా నాలుగు మ్యాచ్ లలో చెన్నై పరాజయం పాలయింది. హైదరాబాద్ సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో విజయం సాధించింది
చెన్నై సూపర్ కింగ్స్ కు వరస ఓటములు వదలడం లేదు. వరసగా నాలుగు మ్యాచ్ లలో చెన్నై పరాజయం పాలయింది. నాలుగు సార్లు ఐపీఎల్ కప్ ను సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ అచ్చిరాలేదనే చెప్పాలి. హైదరాబాద్ సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో విజయం సాధించింది. 154 లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఇంకా రెండు ఓవర్లు మిగిలి ఉండగానే తన సొంతం చేసుకుంది. చెన్నైకి ఇది ఘోర పరాభవమేనని చెప్పాలి.
నిరాశలో ఫ్యాన్స్.....
చెన్నైపై ఎనిమిది వికెట్ల తేడాతో సన్ రైజర్స్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఈ సీజన్ పూర్తి నిరాశనే కల్గిస్తుంది. బౌలింగ్, బ్యాటింగ్ లో జట్టు పటిష్టంగా ఉన్నా బలహీనంగా ఉందని పిస్తున్న జట్లపై కూడా ఓటమి పాలవ్వడంపై ఆ జట్టు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రానున్న రోజుల్లోనై చెన్నై బోణీ కొడుతుందని ఆ జట్టు అభిమానులు ఆశిస్తున్నారు.
Next Story