Sat Nov 16 2024 17:39:03 GMT+0000 (Coordinated Universal Time)
చెడుగుడు ఆడిన చెన్నై
సోమవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 217 అత్యధిక పరుగులు చేసింది
ఐపీఎల్ 2023 ప్రారంభమైన తర్వాత అత్యథిక స్కోరు చేసిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. సోమవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 217 అత్యధిక పరుగులు చేసింది. ఏడు వికెట్లు కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు తోడు కాన్వే మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో చెన్నై భారీ స్కోరు చేసింది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలయిన జట్టు తర్వాత తేరుకుని హోం గ్రౌండ్లో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది. ఐపీఎల్ లో బోణి కొట్టింది.
భారీ లక్ష్యంతో...
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా చెన్నై జట్టును ఆదిలో కలవర పెట్టింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మేయర్స్ అద్భుతంగా ఆడటంతో కేవలం ఐదు ఓవర్లకే 70 పరుగులు దాటింది. దీంతో ఒక దశలో లక్నో విజయం సాధిస్తుందని అంచనా వేశారు. కానీ మొయిన్ ఆలి చేతిలోకి బంతి మారడంతో వరసగా వికెట్లు పడిపోయాయి. నాలుగు వికెట్లు తీసుకున్న మొయిల్ ఆలీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఇరవై పరుగులకు 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివర వరకూ టెన్షన్ పడిన చెన్నై జట్టు ఊపిరి పీల్చుకుంది.
Next Story