Mon Dec 23 2024 12:07:24 GMT+0000 (Coordinated Universal Time)
కష్టాలో చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 154 పరుగులు మాత్రమే చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో పెద్దగా పనితీరు కనపర్చ లేకపోతుంది. దాదాపు అదే జట్టు అయినా గత సీజన్లకు భిన్నంగా వారి ఆటతీరు ఉంటుంది. ఈరోజు సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ అతి తక్కువ పరుగులు చేసింది. ప్రస్తుతం సీజన్ లో 190 ఆ పై పరుగులు చేస్తేనే కొంత హోప్స్ ఉంటాయి. అలాంటిది చెన్నై 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 154 పరుగులు మాత్రమే చేసింది.
తక్కువ స్కోరుకు....
చెన్నై బ్యాటర్లలో మెయిన్ ఆలీ ఒక్కరే 48 పరుగులు అత్యధిక స్కోరు సాధించాడు. అంబటి రాయుడు 27, జడేజా 23 పరుగులు చేసి అవుటయ్యారు. ఇక 155 పరుగుల లక్ష్య సాధనతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిలకడగా రాణిస్తుంది. తొమ్మిది ఓవర్లలో ఒక వికెట్ కోల్పోకుండా 62 పరుగులు చేసింది. క్రీజ్ లో విలయమ్సన్, అభిషేక్ లు ఉన్నారు. అభిషేక్ ఇప్పటికే 39 పరుగులు దాటేశారు.
Next Story