Mon Dec 23 2024 10:45:25 GMT+0000 (Coordinated Universal Time)
నేడు స్టేడియంలోకి రిషబ్ పంత్
క్రికెటర్ రిషబ్ పంత్ నేడు మైదానంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఆడేందుకు కాదు. మ్యాచ్ చూసేందుకు
క్రికెటర్ రిషబ్ పంత్ నేడు మైదానంలోకి అడుగుపెడుతున్నారు. అయితే ఆడేందుకు కాదు. మ్యాచ్ చూసేందుకు. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను చూసేందుకు స్వయంగా రిషబ్ పంత్ స్టేడియానికి రానున్నారని, మ్యాచ్ ను వీక్షిస్తారని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. దాదాపు మూడు నెలల తర్వాత మైదానాన్ని రిషబ్ పంత్ చూస్తున్నారు.
యాక్సిడెంట్ తర్వాత...
రిషబ్ పంత గత ఏడాది డిసెంబరు 30వ తేదీన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన క్రికెట్కు దూరమయ్యారు. గతంలో ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరించిన రిషబ్ పంత్ స్వయంగా మ్యాచ్ను చూసేందుకు స్టేడియానికి వస్తుండటంతో ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిషబ్ పంత్ మోకాలికి సర్జరీ అయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్ నేడు జరిగే మ్యాచ్కు హాజరుకానుండటం విశేషం. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ఒక మ్యాచ్ ఓటమి పాలయింది. లక్నూ సూపర్ జెయింట్స్ చేతిలో పరాజయం పాలయింది. బోణీ కొట్టాలని హోం పిచ్పై ఢిల్లీ క్యాపిటల్స్ ఎదురు చూస్తుంది. ఇందుకు పంత్ హాజరవుతుండటంతో మరింత ఉత్సాహంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు మ్యాచ్ ను ఆడనున్నారు.
Next Story