Fri Dec 20 2024 11:19:25 GMT+0000 (Coordinated Universal Time)
ఇది వార్నర్ విజయమే
కోల్కత్తా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఒక రకంగా ఇది వార్నర్ విజయమేనని చెప్పాలి.
వార్నర్ ఎంత కష్టపడినా జట్టు సభ్యులు సహకరించలేదు. ప్రతి మ్యాచ్‌లో వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నా మిగిలిన వారు చేతులెత్తేయడం, బౌలర్లు రాణించకపోవడంతో ఇన్నాళ్లూ ఐపీఎల్లో ఒక్క విజయాన్ని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోలేకపోయింది. ఎట్టకేలకు కోల్కత్తా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఒక రకంగా ఇది వార్నర్ విజయమేనని చెప్పాలి. ఏ టీం అయినా సమిష్టిగా రాణిస్తేనే విజయం సాధ్యమవుతుంది. ఢిల్లీ వరస పరాజయాలతో డీలా పడటం... ఈ విజయంతో కొంత ఊరట దక్కినట్లే అనిపిస్తుంది.
తొలి విజయం...
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత్తా నైట్ రైడర్స్ ఆది నుంచి తడబడింది. బౌలింగ్ పిచ్ కావడం మూలనేమో... వరసగా వికెట్లు పడిపోయాయి. అత్యంత తక్కువగా 127 పరుగులే చేసింది. అదీ చివరిలో ఆండ్రూ రసెల్ విజృంభించి ఆడకపోతే ఆ మాత్రం స్కోరు కూడా రైడర్స్‌కు దక్కేది కాదు. 127 స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రారంభంలో కొంత కుదుటుగానే ఆడారు. ఎప్పటిలాగానే పృధ్వీ షా తక్కువ పరుగులకే అవుటయ్యాడు. కెప్టెన్ వార్నర్ మాత్రం 57 పరుగులు చేసి విజయానికి ప్రాణం పోశాడు. చివరిలో అక్షర్ పటేల్ పందొమ్మిది పరుగులు చేసి లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో పూర్తి చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
Next Story