Mon Dec 23 2024 10:28:41 GMT+0000 (Coordinated Universal Time)
నిరాశే కాని.. అదో తృప్తి
ఐపీఎల్ తొలి మ్యాచ్ నిరాశ పర్చింది. ఎటువంటి టెన్షన్ లేకుండానే మ్యాచ్ కోల్ కత్తా నైట్ రైడర్స్ సులువుగా గెలిచింది.
ఐపీఎల్ తొలి మ్యాచ్ నిరాశ పర్చింది. ఎటువంటి టెన్షన్ లేకుండానే మ్యాచ్ కోల్ కత్తా నైట్ రైడర్స్ సులువుగా గెలిచింది. మ్యాచ్ ప్రారంభమయిన నాటి నుంచే కేకేఆర్ కు అనుకూలంగా కన్పించింది. ట్యాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ను ఎంచుకుంది. బ్యాంటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే తడబడింది. వరసగా వికెట్లు కోల్పోవడంతో పెద్దగా స్కోరు చేయలేదమోనని అనిపించింది.
మూడేళ్ల తర్వాత....
అయితే థోని, జడేజా క్రీజ్ లోకి వచ్చిన తర్వాత మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. వందలోపే స్కోర్ చేస్తుందని ఊహించిన సూపర్ కింగ్స్ అభిమానులకు 131పరుగులు చేశారు. థోని మూడేళ్ల తర్వాత ఐపీఎల్ లో హాఫ్ సెంచరీ చేశారు. అనంతరం బరిలోకి దిగిన కోల్ కత్తా నైట్ రైడర్స్ పెద్దగా టెన్షన్ పడకుండానే విజయాన్ని సొంతం చేసుకుంది. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఐదు వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను గెలిచింది.
Next Story