Fri Dec 20 2024 11:41:18 GMT+0000 (Coordinated Universal Time)
ఓడిపోయిందని టీవీలు ఆపేశారు.. కానీ
రాజస్థాన్ రాయల్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలయింది. శాంసన్, హిట్ మేయర్ కారణంగా విజయాన్ని దక్కించుకుంది
గుజరాత్ టైటాన్స్ గత సీజన్ విజేత. బౌలింగ్, బ్యాటింగ్‌లో పటిష్టంగా ఉన్న ఆ జట్టు ఈ సీజన్ కూడా విన్నర్ అని భావించారు అనేక మంది. అలాగే దాని ఆటతీరు కూడా అలాగే కొనసాగింది. అయితే రాజస్థాన్ రాయల్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు పెద్ద స్కోరును తేలిగ్గా ఊదిపారేసింది. తాము ఈ సీజన్లో విజేతల లిస్టులో ఉన్నామంటూ రాజస్థాన్ జట్టు మీసం మెలేసింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది.
177 పరుగుుల చేసిన...
తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 177 పరుగులు చేసింది. శుభమన్ గిల్, డేవిడ్ మిల్లర్ అర్ధశతకానికి దగ్గరగా వచ్చి ఆగిపోయారు. 177 పరుగులు పెద్ద లక్ష్యమే. తర్వాత బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆదిలోనే తడబడింది. తొలి ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయింది. పది ఓవర్లకు ఆ జట్టు పెద్దగా రన్‌రేట్ కూడా చేయలేకపోయింది. ఇక మ్యాచ్ వన్ సైడ్ అనుకున్నారంతా. అర్థ శతకం చేసిన సంజూ శాంసన్ కూడా అవుటవుడంతో టీవీలు ఆపేశారు.
హిట్ మేయర్...
అయితే హిట్ మేయర్ ప్రదర్శన ఆకట్టుకుంది. సంజూ శాంసన్ 60 పరుగులు చేశాడు. శాంసన్ ఉన్నంత సేపూ మ్యాచ్ రాజస్థాన్ వైపు ఉన్నట్లు అనిపించింది. శాంసన్ అవుట్ అయిన వెంటనే గుజరాత్‌దే విజయం అనుకున్నారంతా. కానీ హిట్ మేయర్ చెలరేగి పోయారు. 26 బంతుల్లో 56 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అందుకే చివరి వరకూ మ్యాచ్ చూస్తేనే మజా. లేకుంటే.. ఐపీఎల్లో ఆ మజాను కోల్పోతారు. అంచనాలు వేసుకున్నవన్నీ నిజం కావని రాజస్థాన్ మరోసారి నిరూపించింది. 19.2 ఓవర్లలోనే 178 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ అధిగమించింది.
Next Story