Sun Nov 17 2024 21:58:46 GMT+0000 (Coordinated Universal Time)
గుజరాత్ టైటాన్స్‌కు రెండో విజయం
గత ఏడాది ఐపీఎల్ కప్‌ను సాధించిన గుజరాత్ టైటాన్స్ వరసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.
గత ఏడాది ఐపీఎల్ కప్‌ను సాధించిన గుజరాత్ టైటాన్స్ వరసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. టాప్ ఆర్డర్ కుప్పకూలినా తమిళనాడు కుర్రాడు సుదర్శన్ చెలరేగి ఆడటంతో టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై విక్టరీని కొట్టింది. తమకు పరాజయం అనేదే లేదని మరోసారి నిరూపించింది. అత్యధిక పరుగులు.. కీలక సమయంలో చేసిన సుదర్శన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యారు. పాయింట్ల పట్టికలోనూ గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో నిలిచింది. హార్థిక్ పాండ్యాలోని గుజరాత్ టైటాన్స్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా బలంగా ఉండటంతో ఈ విజయం సాధ్యమయింది. సుదర్శన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా దిగి వీరబాదుడు బాదాడు.
లక్ష్యం పెద్దది కాకున్నా...
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. 162 లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు సాహు, శుభమన్ గిల్ చెరో పథ్నాలుగు పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన హార్థిక్ పాండ్యా కూడా ఐదు పరుగులకే వెనుదిరగడంతో గుజరాత్ కష్టాల్లో పడినట్లు కనిపించింది. కానీ సాయి సుదర్శన్ మాత్రం నిలకడగా ఆడుతూ 48 బాల్స్‌లో 62 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్‌కు విజయ్ శంకర్ తోడుగా కొంత సేపు నిలవడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. చివరకు నాలుగు వికెట్లు కోల్పోయి గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది.
Next Story