Fri Dec 20 2024 11:15:21 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైదరాబాద్ లో మరో కీలక మ్యాచ్
నేడు హైదరాబాద్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ నేడు జరగనుంది
నేడు హైదరాబాద్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ నేడు జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ముంబయి, సన్ రైజర్స్ టీంలు ఐపీఎల్ ప్రారంభమయిన తొలినాళ్లలో అపజయాలను వరసగా మూటగట్టుకున్నప్పటికీ తర్వాత కొంత కుదుటపడ్దాయి. వరస విజయాలతో రెండు టీంలు ఊపు మీదున్నాయి.
సన్ రైజర్స్....
దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సన్ రైజర్స్ టీం కూడా వరసగా రెండు విజయాలను చవి చూసింది. ముంబయి కూడా పుంజుకుంది. దీంతో ఇరు జట్టు సమఉజ్జీలు అనే అనుకోవాల్సి ఉంటుంది. ముంబయి జట్టును అత్యధిక పరుగులు చేయకుండా కట్టడి చేసేందుకు సన్ రైజర్స్ శ్రమించాల్సి ఉంటుంది. అధిక స్కోరు చేయకుండా నిరోధించగలిగితే మ్యాచ్ చివర వరకూ ఉత్కంఠ నెలకొనే అవకాశముందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. నిన్ననే ఇరు జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి.
Next Story