Mon Dec 23 2024 08:09:01 GMT+0000 (Coordinated Universal Time)
సీఎస్కే కెప్టెన్సీకి ధోనీ వీడ్కోలు.. షాక్ లో అభిమానులు
మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోనీ సారథ్యంలో చెన్నై అద్భుత విజయాలను సాధించింది. 2010, 2011, 2018, 2021 సీజన్లలో
చెన్నై : ఐపీఎల్-22 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్, క్రికెట్ తలైవా ఎంఎస్ ధోనీ తన అభిమానులకు షాకిచ్చాడు. సీఎస్ కే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ధోనీ ప్రకటించాడు. ధోనీ స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కెప్టెన్ గా నియమితుడయ్యాకు. ఈ మేరకు సీఎస్ కే ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. ధోనీ జట్టులో ఆటగాడిగా కొనసాగనున్నాడు.
మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోనీ సారథ్యంలో చెన్నై అద్భుత విజయాలను సాధించింది. 2010, 2011, 2018, 2021 సీజన్లలో నాలుగుసార్లు టైటిల్ గెలిచింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచీ ధోనినే సీఎస్కే కెప్టెన్గా ఉన్నాడు. కాగా.. ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో.. అభిమానులు షాకయ్యారు. ధోనీ కెప్టెన్సీ లేని చెన్నై జట్టును ఊహించలేమంటూ పోస్టులు పెడుతున్నారు. మార్చి 26న రన్నరప్ కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది.
Next Story