Mon Dec 23 2024 11:05:40 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2023 : ఐపీఎల్ 2023 రేపటి నుంచే
రేపటి నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కాliన్నాయి. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇక సందడే సందడి. రెండు నెలలు కాలక్షేపం
రేపటి నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు ప్రారంభం కాబోతున్నాయి. క్రికెట్ అభిమానులకు ఇక సందడే సందడి. రెండు నెలల పాటు కాలక్షేపానికి ఢోకా లేదు. అద్భుతమైన క్యాచ్‌లు, తక్కువ బాల్స్‌లోనే సెంచరీలు, అత్యధిక స్కోరు నమోదు చేయడం, చివరి బంతి వరకూ ఉత్కంఠ.. ఇక సూపర్ ఓవర్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కు టెన్షన్ తప్పదు. చివరి బాల్ వరకూ ప్రతి మ్యాచ్ ఉత్కంఠ రేపుతుంది. తక్కువ స్కోరుతో అవుట్ కావడం, అత్యధిక పరుగులు చేయడం, ఎక్కువ వికెట్లు తీయడం వంటి పరిణామాలు ఐపీఎల్‌లోనే చోటు చేసుకుంటాయి. టీవీలకు ఇక అతుక్కుపోవాల్సిందే. ఏ టీం ఫైనల్ కు చేరనుందన్నది ముందుగా చెప్పలేం. ప్రతి టీం పైనా అందరికీ ఆశలుంటాయి. చివర వరకూ ఆ టెన్షన్‌తోనే మ్యాచ్ లు ముగుస్తాయి. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది.
రెండు నెలలు...
మెగా టోర్నీతో ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు రెండు నెలలు పండగే పండగ. ప్రతి రోజూ రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమయి మిమ్మల్ని అలరించేందుకు రెడీ అవుతుంది. మొత్తం పది జట్లు. దేశీయ, విదేశీ ఆటగాళ్లతో కూడిన జట్లు క్రికెట్ గ్రౌండ్లో చెలరేగపోతున్నారు. విరాట్ కొహ్లి నుంచి కొత్త ఆటగాళ్ల వరకూ ఇక తమ బ్యాట్‌ను ఝుళిపిస్తారు. ఐపీఎల్ నుంచే ఎంతో మంది టీం ఇండియా జట్టుకు ఎంపికయ్యారు. ఒక సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో చూపిన సత్తాతో టీం ఇండియాలో చోటు దక్కించుకున్నాడంటే అతి శయోక్తి కాదు.
ఇక్కడి నుంచే...
ఇక దినేష్ కార్తీక్ వయసు మీదపడినా ఇటీవల జరిగిన ఆసియా కప్‌కు ఎంపికయ్యాడంటే అది ఐపీఎల్ పుణ్యమేనని చెప్పక తప్పదు. ఒక్కరేంటి ఎంతో మంది ఆటగాళ్లకు ఐపీఎల్ ఒక వరంగా మారింది. టీం ఇండియాకు కూడా అసలైన.. సిసలైన మేలురకమైన ఆటగాళ్లను అందించేందుకు ఐపీఎల్ ఉపయోగపడుతుంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ పెద్దగా శ్రమ పడకుండానే ఐపీఎల్ ద్వారా టీం ఇండియా జట్టును ఎంపిక చేసే పరిస్థితి వచ్చిందంటే.. అది నమ్మి తీరాల్సిందే. ఐపీఎల్లో ప్రతిభ కనపర్చిన వారెవరైనా? ఏ జట్టులో ఉన్నా సరే ఇక టీం ఇండియాలో స్థానం దక్కినట్లే. ఆ స్థానాన్ని నిలుపుకుంటారా? లేదా? అన్నది ఆటగాడి ఆట తీరు, అతడి అదృష్టంపై కూడా ఆధారపడుతుంది.
బెట్టింగ్‌లు కూడా....
బంతి బంతికి బెట్టింగ్‌లు కూడా ఈ ఐపీఎల్ ద్వారానే వింటుంటాం. గెలుస్తాయనుకున్న జట్లుచివరి బంతితో ఓడిపోతాయి. ఓడిపోతాయని భావించిన జట్టు ఒకే ఒక షాట్ తో విక్టరీ కొడుతుంది. ఇన్నీ ఐపీఎల్‌లోనే సాధ్యం. అందుకే ఏటా జరిగే ఐపీఎల్‌కు అంతటి క్రేజ్. కోట్లాది రూపాయలు పోసి కొనుగోలు చేసిన టీంలు గ్రౌండ్లో చెలరేగి ఆడుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు. అలాంటి సీజన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక రెడీ అయిపోండి. మొత్తం పది జట్లు 74 మ్యాచ్‌లు.ప్రతి రోజూ మ్యాచ్. కన్నులపండగగా.
Next Story