Mon Dec 23 2024 15:46:43 GMT+0000 (Coordinated Universal Time)
ఆటగాళ్లే కాదు.. " కోటి" గాళ్లు కూడా?
మరో వారం రోజుల్లో ఐపీఎల్ వేలం ప్రారంభమవుతుంది. ఈ నెల 12, 13 తేదీల్లో ఐపీఎల్ వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది.
మరో వారం రోజుల్లో ఐపీఎల్ వేలం ప్రారంభమవుతుంది. ఈ నెల 12, 13 తేదీల్లో ఐపీఎల్ వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి మరీ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దాదాపు మూడు నెలలకు పైగానే సాగే ఐపీఎల్ పండగలో అన్ని దేశాల ఆటగాళ్లను చూసే అవకాశం లభిస్తుంది. అంతే కాదు అనేక మంది దేశీయ ఆటగాళ్లు ఐపీఎల్ లో రాణించి అనంతరం టీంఇండియాలో చోటు సంపాదించుకున్నారు.
అక్కడ చోటు లేకపోయినా...?
టీం ఇండియాలో ఒకప్పుడు టాప్ ఆర్డర్ లో ఉన్న ఆటగాళ్లు ఇప్పుడు అక్కడ స్థానం కోల్పోయి ఐపీఎల్ లో కీలకంగా మారనున్నారు. సురేష్ రైనా వంటి వారు ఐపీఎల్ లో సత్తా చాటుతున్నారు. దీంతో ఐపీఎల్ తమ ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు తహతహలాడుతుంటారు. దేశంలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లు కూడా ఐపీఎల్ ద్వారానే ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. కోట్ల రూపాయలను మూడు నెలల్లోనూ సంపాదించుకుంటున్నారు.
అత్యధికంగా అమ్ముడుపోయే...?
ఇక మరో వారం రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం జరుగుతుండటంతో అత్యధికంగా అమ్ముడు బోయే ఆటగాడిపై ఇప్పటి నుంచే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అన్నింటికంటే ఐపీఎల్ ను ఎక్కువ సార్లు గెలుచున్న టీంలు గా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ నిలిచాయి. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ డూప్లెసిస్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ లను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. అత్యధిక ధరను చెల్లించి వీరిని కొనుగోలు చేసే అవకాశముందని తెలుస్తోంది.
Next Story