Mon Dec 23 2024 07:19:58 GMT+0000 (Coordinated Universal Time)
భారీ స్కోర్ థ్రిల్లర్ లో కోల్ కతా.. టైటిల్ డ్రీమ్స్ ముగిసె
లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లాస్ట్ బాల్ వరకూ ఎంతో థ్రిల్లింగ్ గా సాగింది. కోల్ కతా నైట్ రైడర్స్ కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయి
ముంబై లోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లాస్ట్ బాల్ వరకూ ఎంతో థ్రిల్లింగ్ గా సాగింది. కోల్ కతా నైట్ రైడర్స్ కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయి.. టోర్నమెంట్ నుండి వైదొలిగింది. లక్నో టీమ్ టాప్-2 జట్లలో ఒకటిగా నిలవడానికి అర్హత సాధించే అవకాశం దక్కనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు నైట్ రైడర్స్ బౌలర్లతో ఓ ఆటాడేసుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. లక్నో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. 70 బంతులను ఎదుర్కొన్న డికాక్... 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 140 పరుగులతో అజేయంగా నిలిచాడు. డికాక్‌కు పూర్తి సహకారం అందించిన కేఎల్ రాహుల్.. 51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. నిదానంగా ఆడుతూ వచ్చిన ఈ ఇద్దరూ ఆఖర్లో రెచ్చిపోయారు. ముఖ్యంగా డికాక్ బౌలర్ ఎవరని చూడకుండా బాదుడే బాదుడు అనే ప్లాన్ తో ముందుకు వెళ్ళాడు. కోల్ కతా బౌలర్లు కూడా చేతులెత్తేసినట్లు వారి బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థం అయిపోయింది.
211 పరుగుల విజయలక్ష్యంతో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కోల్ కతా.. కేవలం రెండు పరుగులతో మ్యాచ్ ను చేజార్చుకోవడమే కాకుండా క్వాలిఫై అయ్యే అవకాశాన్ని కూడా మిస్ చేసుకుంది. ఆఖరి ఓవర్ లో 21 పరుగులు కావాల్సిన సమయంలో రింకూ సింగ్ మొదటి మూడు బంతులలో 4, 6, 6, కొట్టడంతో నైట్ రైడర్స్ దే విజయం అన్నట్లుగా సాగింది. మూడు బంతుల్లో 5 పరుగులు కావాల్సిన సమయంలో రెండు పరుగులు వస్తాయి.. ఆ సమయంలో రింకూ సింగ్ కొట్టిన షాట్ ను ఇవాన్ లివిస్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో మ్యాచ్ లో టెన్షన్.. ఆఖరి బంతికి ఉమేష్ యాదవ్ ను స్టయినిస్ బౌల్డ్ చేయడంతో పూణే విజయాన్ని సొంతం చేసుకుంది. 7 బంతుల్లో 21 పరుగులు చేసిన నరైన్ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో మిగిలిపోయాడు. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ డకౌట్ అవ్వగా.. అభిజీత్ తోమర్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. నితీష్ రాణా పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్ చేశాడు. 22 బంతుల్లో 9 ఫోర్లతో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ అయ్యర్ 29 బంతుల్లో 50 పరుగులు చేసి కీలక సమయంలో అవుట్ అయ్యాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రస్సెల్ 11 బంతులాడి 5 పరుగులు మాత్రమే చేయడం నైట్ రైడర్స్ కు పెద్ద మైనస్ గా మారింది. సామ్ బిల్లింగ్స్ 24 బంతుల్లో 36, రింకూ సింగ్ 15 బంతుల్లో 40, నరైన్ 7 బంతుల్లో 21 నాటౌట్.. మ్యాచ్ ను కోల్ కతా చేతుల్లో ఉంచగా.. ఆఖరి రెండు బంతుల్లో వికెట్లు పడడంతో పూణే విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో పూణే క్వాలిఫై అయింది. కోల్ కతా ఎలిమినేట్ అయింది.

Next Story