Sun Nov 17 2024 16:35:46 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2023 : ధోని మైదానంలో కన్పించేది ఇక?
క్రికెట్ ఫ్యాన్స్‌కు మహేంద్ర సింగ్ థోని అంటే ఒక ప్రత్యేక అభిమానం. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ కాబోతుంది.
క్రికెట్ ఫ్యాన్స్‌కు మహేంద్ర సింగ్ థోని అంటే ఒక ప్రత్యేక అభిమానం. ఎందుకో తెలియదు. మైదానంలో కూల్ గా వ్యవహరించే ధోని మ్యాచ్ ఆడుతుంటే కనురెప్ప ఆర్పకుండా చేసే ఫ్యాన్స్ ఉన్నారు. వయసు రీత్యా కొందరు ఆటగాళ్లు క్రికెట్‌కు దూరమవుతారు. మరికొందరు ఆటతీరుతో క్రికెట్‌కు గుడ్‌బై చెబుతారు. థోని మొదటి వరసకు చెందిన వాడు. వయసు రీత్యానే అన్ని ఫార్మాట్లలో ధోనీ రిటైర్ అయ్యాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో ధోని ఆట చూడలేం. వికెట్ కీపర్‌గా, బ్యాటర్ గా, కెప్టెన్‌గా మహేంద్రుడు ఎన్నో అవార్డులను ఇండియాకు అందించాడు. అలాంటి ధోనిని మైదానంలో చూడటం ఎవరికి ఉండదు.
పసుపురంగు జెర్సీలో...
ఇక ఐపీఎల్ సీజన్ వస్తుందంటే చాలు పసుపు రంగు జెర్సీతో దర్శనమిచ్చే ధోని కోసం ఇప్పటికీ వేలాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్‌లోనే ధోనిని చూడటం సాధ్యం. ఐపీఎల్‌లోనే ధోని ఆట మెరుపులు వీక్షించడం వీలవుతుంది. అందుకే ఐపీఎల్ వస్తుందంటే ధోని కోసం చూసేవాళ్లు లక్షల సంఖ్యలోనే ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోనీ వికెట్ల వెనుక కదిలే తీరు. డెత్ ఓవర్లలో ధోని మైదానంలో దిగితే పెద్ద లక్ష్యం కూడా చిన్న పోతుందన్న ఒక భరోసా. అందుకే ధోని అంటే ఒక నమ్మకం.. ఒక భరోసా.
మూడుసార్లు జట్టును...
మూడుసార్లు జట్టుకు కప్‌ను సాధించిపెట్టిన ఘనత మహేంద్ర సింగ్ ధోనీదే. పలు సార్లు సెమి ఫైనల్స్ వరకూ జట్టును చేర్చడంలో ధోని పాత్రను మరువలేం. అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పిన తర్వాత ధోని ఇక కన్పించేది ఐపీఎల్‌లోనే కావడంతో ప్రత్యేకంగా ధోని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు అయితే ఈ సీజన్ ధోనికి ఆఖరి సీజన్‌గా చెబుతున్నారు. ఈ ఐపీఎల్ తర్వాత ధోని పూర్తిగా క్రికెట్‌కు రెస్ట్ ఇస్తారని క్రికెట్ పండితులు చెబుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ కూల్ ఉండే ధోని మైదానంలో ఇక కనిపించక పోవచ్చు. ధోనీని కళ్లారా చూడాలనుకుంటే ఈ ఐపీఎల్ ను చూడకతప్పదు.
మరికొందరు ఆటగాళ్లు...
ధోనితో పాటు మరికొందరు ఆటగాళ్లు కూడా ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు పూర్తిగా దూరం కానున్నారు. కొందరు తమ ప్రాంతాల్లో అకాడమీలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే.. మరికొందరు కామెంటేటర్లుగా కాలక్షేపం చేయడానికి రెడీ అవుతున్నారు. 38 ఏళ్ల దినేష్ కార్తీక్ కుడా ఇదే చివరి ఐపీఎల్. ఇప్పటికే కామెంటేటర్ గా రాణిస్తుండటంతో ఆ వృత్తిలో మనకు కనిపించే వీలుంది. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్‌కు కూడా ఇదే చివరి ఐపీఎల్ అయ్యే అవకాశముంది. ఎందుకంటే వరస ఫెయిల్యూర్లు ఇబ్బంది పెడుతున్నాయి. టీం ఇండియా ఆటగాడు అంబటి రాయుడు కూడా ఐపీఎల్ లో చివరిగా కన్పించనున్నాడు. సో..చాలా మంది ఆటగాళ్లకు ఇదే చివరి ఐపీఎల్ కావడంతో వారిని మైదానంలో చూడాలంటే ఈ ఐపీఎల్ కంపల్సరీ చూడాల్సిందే.
Next Story