Fri Dec 20 2024 16:49:07 GMT+0000 (Coordinated Universal Time)
ముంబయి అలవోకగా గెలుపు
కోల్కత్తా నైట్ రైడర్స్‌పై ముంబయి విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ముంబయి గెలుపు సాధించింది.
కోల్కత్తా నైట్ రైడర్స్‌పై ముంబయి విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో ముంబయి గెలుపు సాధించింది. అలవోకగా గెలుపును సాధించింది. ముంబయి ఇండియన్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. టాస్ గెలిచిన ముంబయ ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత్తా నైట్ రైడర్స్ ఇరవై ఓవర్లు ఆడి ఆరు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేశారు. వెంకటేశ్ అయ్యార్ సెంచరీ చేశారు. ఐపీఎల్ 2023లో ఇది రెండో సెంచరీగా నమోదయింది. 104 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్ వెనుదిరిగారు. రస్సెల్ 21 పరుగులు చివరిలో దూకుడుగా ఆడగా భారీ స్కోరు చేయగలిగింది. రింకూ సింగ్ 18 పరుగులకే ఔటయ్యాడు.
భారీ లక్ష్యమే అయినా..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ తొలి ఓవర్ లో కొంత నెమ్మదిగా ఆడినా తర్వాత దూకుడు పెంచింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రోహిత్ 20 పరుగులకే అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ 58 పరుగులు చేసి అవుటయ్యారు. పది ఓవర్లలో 110 పరుగులు చేసిన ముంబయి ఇండియన్స్ గెలుపు దిశగా పయనిస్తుందని ముందే భావించారు. తిలక్ వర్మ మరోసారి సక్సెస్ అయ్యాడు. ముప్ఫయి పరుగులు చేసి అవుటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత బ్యాట్‌ను ఝుళిపించాడు. 43 పరుగులు చేసి అవుటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ తనపై వస్తున్న విమర్శలకు ఈ మ్యాచ్ ద్వారా చెక్ పెట్టాడు. టిమ్ డేవిడ్, కామ్రాన్ గ్రీన్ కలిపి మ్యాచ్‌ను ముగించారు.
Next Story