Sat Nov 23 2024 07:32:57 GMT+0000 (Coordinated Universal Time)
కమిన్స్ ఊచకోత.... చూసి తీరాల్సిందే
ముంబయి మూడోసారి ఓటమి పాలయింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతుందనుకున్న మ్యాచ్ ను కమిన్స్ వన్ సైడ్ అని తేల్చి పారేశారు.
ముంబయి మూడోసారి ఓటమి పాలయింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగుతుందనుకున్న మ్యాచ్ ను కమిన్స్ వన్ సైడ్ అని తేల్చి పారేశారు. కమిన్స్ బ్యాటింగ్ తో ముంబయి జట్టు బెంబేలెత్తిపోయింది. అప్పటి వరకూ ముంబయి వైపు తొంగి చూస్తున్న విజయం కమిన్స్ షాట్స్ దెబ్బకు కోల్ కత్తా నైట్ రైడర్స్ వైపునకు మొగ్గాల్సి వచ్చింది. తొలుత ముంబయి జట్టు బ్యాటింగ్ చేసింది. ముంబయి జట్టు 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది.
15 బంతుల్లోనే....
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కత్తా నైట్ రైడర్స్ తొలి ఓవర్లలోనే కీలక మైన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓవర్ కు పన్నెండు పరుగులకు పైగానే చేయాల్సి ఉంది. అయితే వెంకటేశ్ అయ్యర్, కమిన్స్ లు విధ్వంసకర బ్యాటింగ్ తో మ్యాచ్ ను తమ వైపనకు తిప్పుకున్నారు. వెంకటేశ్ అయ్యర్ అర్థశతకం పూర్తి చేసుకుని కొంత నెమ్మదిగా ఆడుతుండగా, అప్పుడే వచ్చిన కమిన్స్ మాత్రం ముంబయి బౌలర్లను చీల్చి చెండాడాడు. కేవలం 15 బంతుల్లో 56 పరుగులు పూర్తి చేశాడు. ఆరు సిక్స్ లు, నాలుగు ఫోర్లతో బెంబేలెత్తించాడు. ముంబయి జట్టు హ్యాట్రిక్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.
Next Story