Sat Dec 21 2024 00:14:31 GMT+0000 (Coordinated Universal Time)
కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్... మురుగన్ దెబ్బకు?
ముంబయి ఇండియన్స్ భారీ స్కోర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది.
ముంబయి ఇండియన్స్ భారీ స్కోర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది. ఇరవై ఓవర్లకు 177 పరుగులు చేసి అతి పెద్ద లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ముంబయి ఇండియన్స్ ఉంచింది. టీ 20లో అతి పెద్ద స్కోరు అయినా ఛేదన కావడంతో కొంత కష్టమేనన్నది క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. ముంబయి ఇండియన్స్ లో ఇషాన్ కిషన్ 81 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ముంబయి ఇండియన్స్ ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచింది.
ఉత్కంఠగానే...
తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ను ఎంచుకుంది. ముంబయి ఇండియన్స్ ఉతికి ఆరేశారు. అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మూడు ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ముప్ఫయి పరుగులు చేసింది. పృధ్వీషా, స్టీఫెర్ట్ క్రీజ్ లో ఉన్నారు. కానీ మురుగన్ అశ్విన్ బౌలింగ్ లో స్టీఫెర్ట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మణిదీప్ సింగ్ కూడా అదే ఓవర్ లో ఔటయ్యాడు. దీంతో 4 ఓవర్లకు 31 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ కోల్పోయింది. అత్యంత ఉత్కంఠ భరితంగా మ్యాచ్ సాగే అవకాశముంది.
Next Story