Fri Dec 20 2024 16:42:46 GMT+0000 (Coordinated Universal Time)
గెలిపించడానికి ఒక్కడు చాలడూ
పంజాబ్ కింగ్స్ లక్నో సూపర్ వారియర్స్ మీద విజయం సాధించింది. సికిందర్ రజా రాణించడతో మ్యాచ్ గెలుపు సాధ్యమయింది
మ్యాచ్‌లో ఒక్క ప్లేయర్ క్లిక్ అయితే చాలు ఇక గెలిచినట్లే. క్రీజ్‌లో కుదురుకుని ప్రత్యర్థి బౌలర్లకు అలవాటుపడితే చాలు మ్యాచ్ గెలవడం గ్యారంటీ. ఇప్పటి వరకూ జరిగిన అనేక మ్యాచ్‌లలో ఇది రుజువయింది. అందుకే ఐపీఎల్ అంటే అంత క్రేజ్. అంతటి మజా. తాజాగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా అదే అనిపించింది. లక్నో ఇక గెలిచినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా పంజాబ్ చివరకు మ్యాచ్ గెలవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఒకే ఒక్కడు ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించాడు. ఊహించని ఈ విజయం పంజాబ్ కింగ్స్ ఆటగాడు సికిందర్ రాజాతోనే సాధ్యమయింది.
పెద్ద పరుగులు...
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ వారియర్స్ బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయింది. పంజాబ్ బౌలర్ల ధాటికి పెద్ద పరుగులు చేయలేకపోయారు. కేఎల్ రాహుల్ మినహా ఎవరూ సరిగా ఆడలేకపోయారు. కేఎల్ రాహుల్ 74 పరుగులు చేయడంతో లక్నో ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగలిగింది. రాహుల్ తర్వాత మేయర్స్ 29 పరుగులు చేశాడు. అంతే తప్ప మరెవరూ రాణించలేదు. రాహుల్ అవుట్ అయిన తర్వాత జట్టు స్కోరు బోర్డు మీద రన్స్ రాబట్టలేకపోయింది.
అనంతరం ఛేదనలో...
160 పరుగులు ఐపీఎల్లో పెద్ద లక్ష్యమేమీ కాదు. పంజాబ్ ఉఫ్ అని ఊదిస్తుందని అని భావించారు. కానీ తొలి ఓవర్లోనే మొదటి వికెట్ పడింది. తర్వాత రెండో వికెట్... ఇలా వరసగా వికెట్లు పడటంతో పంజాబ్‌కు ఇక ఓటమి గ్యారంటీ అని అనుకున్నారంతా. సికిందర్ రజా బరిలోకి కీలక సమయంలో నిలబడి జట్టుకు 57 పరుగులు అందించాడు. చివరిలో షారూక్ కూడా బాదుడు మొదలుపెట్టడంతో ఉత్కంఠ మధ్య పంజాబ్ విజయం సాధ్యమయింది. చివరలో షారూక్ పది బంతుల్లో 23 పరుగులు చేసి రెండు వికెట్ల తేడాతో విజయానని దక్కించుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా సికందర్ రజా ఎంపికయ్యారు.
Next Story