Fri Dec 20 2024 16:42:51 GMT+0000 (Coordinated Universal Time)
పంజాబ్‌కు రెండో విజయం
పంజాబ్ కింగ్స్ రెండో విజయం నమోదయింది. పంజాబ్ కింగ్రస్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య చివరి వరకూ ఉత్కంఠ పోరు కొనసాగింది
పంజాబ్ కింగ్స్ ఖాతాలో రెండో విజయం నమోదయింది. పంజాబ్ కింగ్రస్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య చివరి వరకూ ఉత్కంఠ పోరు కొనసాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 56 బాల్స్‌లో 86 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ 34 బాల్స్‌లో 60 పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. అనంతరం వికెట్లు కోల్పోతున్నా శిఖర్ ధావన్ చెలరేగి ఆడటంతో 197 పరుగులు చేసి రాజస్థాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
భారీ లక్ష్యంతో...
అయితే భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆదిలోనే తడబాటు పడింది. జైశ్వాల్, బట్లర్లు తక్కువ పరుగులకే అవుట్ కావడంతో రాజస్థాన్ విజయంపై తొలి ఐదు ఓవర్లలో సందేహం తలెత్తింది. అయితే కెప్టెన్ సంజూ శాంసన్, హిట్ మేయర్లు వీరబాదుడు బాదడంతో గెలుపు దిశగా పయనించినట్లే కనిపించింది. ధ్రువ్ జూరెల్ 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. అయితే ఏడు వికెట్లు కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లకు 192 పరుగులే చేయగలిగింది. దీంతో ఐదు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయాన్ని సాధించినట్లయింది.
Next Story