Fri Dec 20 2024 05:46:27 GMT+0000 (Coordinated Universal Time)
మ్యాచ్ అలా మలుపు తిరిగి చివరకు
చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ ఒక పరుగు తేడాతో విజయం దక్కించుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ ఒక పరుగు తేడాతో విజయం దక్కించుకుంది. టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరవై ఓవర్లలో 200 పరుగులు చేసింది. ఓపెనర్ కాన్వే మరలా చెలరేగిపోయాడు. 52 బంతుల్లో 92 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 37, శివమ్ దూబే 28 పరుగులు, రవీందర జడేజా 12, మొయిన్ ఆలీ 10, ధోని 13 పరుగులు చేశారు.
201 పరుగుల లక్ష్యంతో...
పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, కరన్, రాహుల్ చాహర్, సికిందర్ రాజీ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఆచి తూచి ఆడాల్సి వచ్చింది. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రమించాల్సి వచ్చింది. అయినా సాధ్యం కాలేదు. మూడు వికెట్లు కోల్పోయినా లివింగ్ స్టోన్ నిలదొక్కుకున్నాడు. పంజాబ్ టీంలో ప్రభసిమ్రన్ 42 పరుగులు చేశాడు. లివింగ్‌స్టోన్ మూడు సిక్సర్లు బాదడంతో పంజాబ్ విజయానికి చేరువలోకి వచ్చింది.
లక్ష్య ఛేదనలో...
అయితే 40 పరుగుల వద్ద అవుట్ కావడంతో పంజాబ్ ఇక కోలుకోలేదన్న దశలో కరన్ పరుగుల సునామీ సృష్టించాడు. మళ్లీ పంజాబ్ ఆశలు చిగురించాయి. కానీ పాతిరానా కరన్ అవుట్ చేయడంతో మళ్లీ నిరాశలోకి వెళ్లిపోయింది. మూడు ఓవర్లలో ముప్ఫయి ఒక్క పరగులు చేయాల్సి ఉండగా చివరకు పదిహేను బంతుల్లో 26 పరుగులు చేయాల్సి వచ్చింది. రెండు ఓవర్లు.. 22 పరుగులు.. టెన్షన్ నెలకొంది. లక్ చెన్నై సూపర్ కింగ్స్ వైపే ఉంది.
చివరి బంతి వరకూ...
జితేశ్ శర్మ సిక్సర్ కొట్టగా బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో మ్యాచ్ మళ్లీ మొదటి కొచ్చింది. ఎనిమిది బంతుల్లో పదిహను పరుగులు చేయాల్సి ఉండగా, రాజా ఫోర్ కొట్టడంతో పంజాబ్ శిబిరంలో మళ్లీ ఆశలు చిగురించాయి. దీనికి తోడు వైడ్ బాల్ కూడా పడటంతో ఏడు బంతులకు పది పరుగులు చేయాల్సి వచ్చింది. ఒక ఓవర్లో తొమ్మిది పరుగులు.. రెండు బాల్స్.. ఐదు పరుగులు ఇలా స్కోరు బోర్డు ఉత్కంఠ రేపింది. ఒక బంతి మూడు పరుగులు... చివరకు పంజాబ్ మూడు పరుగులు చేసి విజయం సాధించింది.
Next Story