Mon Dec 23 2024 10:33:23 GMT+0000 (Coordinated Universal Time)
IPL AUCTION 2022 : పంజాబ్ కింగ్స్ లోకి శిఖర్.. రాజస్థాన్ లోకి రవిచంద్రన్
వేలం ప్రారంభమైన కొద్దిసేపటికే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ రూ.8.25 కోట్లకు శిఖర్ ధావన్ ను, దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడను
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలం ఆరంభమైంది. ఉదయం 11 గంటలకు బెంగళూరులో వేలం ప్రారంభమైంది. మొత్తం 590 ఆటగాళ్లను 10 జట్లు రూ. 560 కోట్లతో కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఒక్కోజట్టు 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉండగా.. యువ క్రికెటర్లకు రెడ్ కార్పెట్ వేస్తారాన్న ఊహాగానాలున్నాయి.
వేలం ప్రారంభమైన కొద్దిసేపటికే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ రూ.8.25 కోట్లకు శిఖర్ ధావన్ ను, దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడను రూ.9.25 కోట్లకు దక్కించుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ రూ.5 కోట్ల వేలం పాడి.. రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.7.25 కోట్ల వేలానికి దక్కించుకుంది. ప్రస్తుతం మెగా వేలం కొనసాగుతోంది.
News Summary - Punjab Kings XI acquired Shikhar Dhawan for Rs 8.25 crore and South African star pacer Kagiso Rabada for Rs 9.25 crore
Next Story