Mon Dec 23 2024 10:19:47 GMT+0000 (Coordinated Universal Time)
"మిస్టర్ ఐపీఎల్" సురేష్ రైనాకు ఊహించని షాక్
"మిస్టర్ ఐపీఎల్" గా పేరొందిన సురేష్ రైనా కు ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ సీజన్లలో 5 వేల పరుగులు
"మిస్టర్ ఐపీఎల్" గా పేరొందిన సురేష్ రైనా కు ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ సీజన్లలో 5 వేల పరుగులు చేసిన సురేష్ రైనా ను తొలిరౌండ్ లో కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. చైన్నె సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన సురేష్ రైనాను "చిన్న తలా" అని పిలుచుకుంటారు అభిమానులు. అయితే.. సీఎస్ కే కూడా బిడ్ వేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read : టీ20 వేలంలో అపశృతి.. స్పృహతప్పి పడిపోయిన ఆక్షనర్
గతంలో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకి ఆడిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా మొదటి రౌండ్లో అమ్ముడుపోకపోవడం విశేషం. ఇక సౌతాఫ్రికా క్రికెటర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ఈ సీజన్ లో అమ్ముడుపోని మొదటి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. మిల్లర్ ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోలేదు. బిగ్‌బాష్ లీగ్ 2022 సీజన్లో అదరగొట్టినప్పటికీ షకీబ్‌ను కొనుక్కోవడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు.
News Summary - Raina, Smith, Miller, Shakib Unsold, Set to Return in Accelerated Round
Next Story