Mon Dec 23 2024 11:28:22 GMT+0000 (Coordinated Universal Time)
శివమ్ దూబే పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జడేజా, బ్రేవో
దూబే క్యాచ్ ను సరిగా అంచనా వేయకపోవడంతో జడేజా-బ్రేవో లకు ఎంతో కోపం వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే 6 మ్యాచ్ లలో 5 మ్యాచ్ లు ఓడిపోయింది. మార్పులు చేస్తున్నా కూడా జడేజా కెప్టెన్సీలో విజయాలు అందుకోవడం చాలా కష్టమవుతూ వస్తున్నాయి. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా చెన్నై ఓటమిని మూటగట్టుకుంది. డేవిడ్ మిల్లర్ మంచి ఇన్నింగ్స్ తో చెన్నైకు విజయాన్ని దూరం చేశాడు. మిల్లర్ 51 బంతుల్లో 94 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో గుజరాత్ టైటాన్స్ చివరి ఓవర్ థ్రిల్లర్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. మిల్లర్ ఇన్నింగ్స్‌లో ఆరు సిక్స్‌లు, ఎనిమిది ఫోర్లు ఉన్నాయి.
డ్వేన్ బ్రావో బౌలింగ్ లో 17వ ఓవర్లో శివమ్ దూబే ఫీల్డింగ్ చేస్తున్న డిప్ మిడ్ వికెట్ వైపు గాలిలో బంతిని కొట్టాడు మిల్లర్. దానిని దూబే క్యాచ్ చేస్తారని బౌలర్ తో సహా చెన్నై అభిమానులు కూడా ఆశించారు. అయితే ఫ్లడ్‌లైట్ వెలుతురు కారణంగా దూబే క్యాచ్‌కి వెళ్లలేకపోయాడు. CSK కెప్టెన్ రవీంద్ర జడేజాకు దూబే చేసిన ప్రయత్నం నచ్చలేదు. CSK ఆటగాళ్లు మిల్లర్ వికెట్ తీస్తే విజయం తమదే అనే భావనలో ఉన్న సమయంలో దూబే క్యాచ్ ను సరిగా అంచనా వేయకపోవడంతో జడేజా-బ్రేవో లకు ఎంతో కోపం వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిల్లర్ క్యాచ్ ను దూబే అందుకుని ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అంటున్నారు.
Next Story