Mon Dec 23 2024 10:39:21 GMT+0000 (Coordinated Universal Time)
ఐపీఎల్ వేలంలో అందరి చూపు ఆమెవైపే.. ఇంతకీ ఎవరీ కావ్య మారన్ ?
గూగుల్ లో ఆమె పేరు ట్రెండ్ అయింది. ఎస్ఆర్ హెచ్ డైరెక్టర్ టామ్ మూడీ, బౌలింగ్ మెంటార్ ముత్తయ్య మురళీధరన్ తో కలిసి ఆమె
SRH CEO Kaviya Maran wins hearts of cricket fans again at auctionఐపీఎల్ మెగా వేలంలో రెండో రోజూ జోరుగా కొనసాగుతోంది. కొత్త ప్లేయర్ల కంటే.. టాప్ మోస్ట్ ప్లేయర్లకే ఎక్కువ ధర పలుకుతోంది. ఇప్పటి వరకూ జరిగిన వేలంలో.. పలువురు టీమిండియా ఆటగాళ్లు అత్యధిక వేలానికి ఆయా ఫ్రాంఛైజీల్లోకి వెళ్లిపోయారు. కాగా.. ఈ వేలంలో ఓ అమ్మాయి స్పెషల్ ఎట్రాక్షన్ అయింది. ఆమె పేరే కావ్యా మారన్. వేలంలో అందరి కళ్లూ ఆమె వైపే. దాంతో ఆమె ఎవరో తెలుసుకునేందుకు గూగుల్ లో సెర్చింగ్ మొదలుపెట్టారు నెటిజన్లు.
Also Read : కరోనా అంతమయ్యేది అప్పుడే : డబ్ల్యూహెచ్ఓ
గూగుల్ లో ఆమె పేరు ట్రెండ్ అయింది. ఎస్ఆర్ హెచ్ డైరెక్టర్ టామ్ మూడీ, బౌలింగ్ మెంటార్ ముత్తయ్య మురళీధరన్ తో కలిసి ఆమె వేలంలో పాల్గొన్నారు. దీంతో అసలు ఆమె ఎవరు? ఎస్ఆర్హెచ్ ఓనర్ ఎవరు? అంటూ సెర్చ్ చేయడంతో కావ్యా మారన్ పేరు బాగా ట్రెండ్ అయింది. 2018 ఐపీఎల్ వేలం సమయంలోనూ కావ్యా పేరు ఇలానే ట్రెండ్ అయింది. అయితే అప్పటి వేలం సమయంలో ఆమె ఎస్ఆర్ హెచ్ ఆక్షన్ గర్ల్ అంటూ ట్విట్టర్లో వైరల్ చేశారు. తొలిసారి ఆమె 2018 సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ సందర్భంగా ఆమె అందరికీ కనిపించారు. కావ్యా మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు కళానిధి మారన్ కుమార్తెనే ఈ కావ్యా మారన్ (30). ప్రస్తుతం ఆమె సన్ మ్యూజిక్, సన్ టీవీకి చెందిన ఎఫ్ఎం చానెల్స్ బాధ్యతలను చూసుకుంటున్నారు.
Next Story