Mon Dec 23 2024 12:00:36 GMT+0000 (Coordinated Universal Time)
రెండు బంతుల్లో....మ్యాచ్ మొత్తాన్ని మార్చేశాడే?
తెవాతియా రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి ఎవరూ ఊహించని విధంగా గుజరాత్ టైటాన్స్ కు అద్భుతమైన విజయం అందించాడు
మ్యాచ్ మొత్తం రెండు బంతుల్లో మార్చేయడం సాధ్యమా? రెండు బంతులు.. పన్నెండు పరుగులు. రెండు బంతులకు సిక్సర్ కు తరలిస్తేనే విజయం సాధ్యమవుతంది. కానీ అది చాలా కష్టం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యమని నిరూపించారడు తెవాతియా. రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి ఎవరూ ఊహించని విధంగా గుజరాత్ టైటాన్స్ కు అద్భుతమైన విజయం అందించాడు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య రెండు బంతులు రెండు సిక్సర్లుగా మారడంతో ప్రేక్షకులు సయితం మునికాళ్ల మీద నిలుచుని తెవాతియా బ్యాటింగ్ ను చూశారు.
ఓటమి ఖాయమని...
గుజరాత్ టైటాన్స్ ఓటమి ఖాయమని తేలిపోయింది. 20వ ఓవర్లో 19 పరుగులు సాధిస్తే గుజరాత్ గెలిచినట్లే. కానీ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ కు అనుకూలంగా కన్పించింది. ఒడియన్ స్మిత్ బౌలర్ గా ఉండటంతో మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. అప్పుడే బ్యాటింగ్ కు దిగిన తెవాతియా పైనే భారం అంతా ఉంది. వత్తిడిని అధిగమించి తెవాతియా రెండు బంతులను సిక్సర్లుగా మలచి జట్టుకు విజయాన్ని అందించాడు. పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసి 189 పరుగులు చేసింది. దీనిని గుజరాత్ టైటాన్స్ ఛేదించింది.
Next Story