Mon Dec 15 2025 00:13:44 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్ : ఐపీఎల్ 2022 నిర్వహణ తేదీ ఖరారు
ఈ ఏడాది భారత్ లో కరోనా తగ్గుముఖం పట్టడంతో.. ఐపీఎల్ 2022 సీజన్ మొత్తాన్ని(70 మ్యాచ్ లు) మహారాష్ట్రలోనే నిర్వహించేందుకు..

క్రికెట్, ఐపీఎల్ ప్రియులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ 2022 నిర్వహణకు ముహూర్తం ఖరారు చేసింది. తాజాగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ ను ప్రారంభించాలని నిర్ణయించింది. తొలుత మార్చి 27నుంచి సీజన్ ను ప్రారంభించాలని బీసీసీఐ భావించింది. కానీ.. ఐపీఎల్ ప్రసార భాగస్వామి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మార్చి 26న టోర్నీని స్టార్ట్ చేయాలని అభ్యర్థించింది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అభ్యర్థన మేరకు మార్చి 26 నుంచి ఐపీఎల్ సీజన్ 15 ను ప్రారంభించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జాతీయ మీడియా వెల్లడించింది. కాగా.. ఈ ఏడాది భారత్ లో కరోనా తగ్గుముఖం పట్టడంతో.. ఐపీఎల్ 2022 సీజన్ మొత్తాన్ని(70 మ్యాచ్ లు) మహారాష్ట్రలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ముంబై, పూణెలలో ఉన్న క్రికెట్ స్టేడియంలలో ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ క్రికెట్ లీగ్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను అతి త్వరలోనే రిలీజ్ చేస్తామని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో.. ఈసారి ప్రేక్షకులను మైదానంలోకి అనుమతిస్తారా ? లేదా అన్న విషయంపై మహారాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని బ్రిజేష్ కుమార్ తెలిపారు.
News Summary - The league phase of IPL 2022 will be Starts from March 26th , Announces BCCI
Next Story

