Mon Dec 23 2024 07:40:14 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు మరో హైఓల్టేజీ మ్యాచ్
ఈరోజు ఐపీఎల్ 2022లో మరో రసవత్తరమైన పోరు జరుగుతుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది
ఐపీఎల్ 2022 మ్యాచ్ లన్నీ హై ఓల్టేజీని తలపిస్తున్నాయి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతుంది. సిక్సర్ల మోత.. బౌండరీల బాదుడుతో స్టేడియాలు దద్దరిల్లుతున్నాయి. అంచనాలకు విరుద్ధంగా విజయాలు లభిస్తున్నాయి. చివర వరకూ విజయం ఎవరిదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. టాస్ గెలిచిన ప్రతి జట్టు తొలుత ఫీల్డింగ్ నే ఎంచుకుంటున్నాయి. లక్ష్య సాధన సులువుగా భావించడం, పిచ్ పరిస్థితుల కారణంగా ఫీల్డింగ్ వైపే అన్ని జట్లు మొగ్గు చూపుతున్నాయి.
ఎనిమిదో మ్యాచ్....
ఈరోజు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మరో రసవత్తరమైన పోరు జరుగుతుంది. ఐపీఎల్ లో ఇది ఎనిమిదో మ్యాచ్. కోల్ కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. రెండు జట్లూ బలమైనవే. చెన్నై సూపర్ కింగ్స్ ను కోల్ కత్తా నైట్ రైడర్స్ ఓడించింది. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును పంజాబ్ కింగ్స్ ఓడించింది. అయితే కోల్ కత్తా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ చేతిలో ఒక మ్యాచ్ లో ఓటమి పాలయింది.
రెండు జట్లు బలంగానే....
ఈ నేపథ్యంలో ఈరోజు జరగనున్న మ్యాచ్ మరోసారి రెండు జట్ల అభిమానులను టెన్షన్ పెట్టనుంది. రెండు జట్లు ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్ లో బలంగా ఉండటంతో ఎవరిది విజయమనేది చివరి నిమిషం వరకూ చెప్పలేం. అదే సమయంలో బ్యాటర్లు రాణించినా బౌలర్లు ప్రత్యర్థి స్కోరును కట్టడి చేయలేకపోతే ఫలితం లేదు. ఈ మ్యాచ్ లో బౌలర్లు మ్యాచ్ విజయాన్ని డిసైడ్ చేస్తారన్నది క్రీడా విశ్లేషకుల అంచనాగా ఉంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story