Fri Dec 20 2024 06:22:40 GMT+0000 (Coordinated Universal Time)
చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఈరోజ జరిగిన మ్యాచ్ ఎలాంటి ఉత్కంఠ లేకుండా సాగింది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఈరోజ జరిగిన మ్యాచ్ ఎలాంటి ఉత్కంఠ లేకుండా సాగింది. చివరకు చెన్నై సూపర్ కింగ్స్నే విజయం వరించింది. అతి తక్కువ స్కోరుకే ముంబయి ఇండియన్స్ ఓటమి పాలు కావడంతో చెన్నై కి విజయం సులువుగా మారింది. ముంబయి ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయి ఇరవై ఓవర్లలో కేవలం 139 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై బౌలర్లు రెచ్చిపోయారు. ముంబయి జట్టులో కేవలం నేహల్ వధేరా మాత్రమే 64 పరుగులు చేశారు. రోహిత్ శర్మతో పాటు అందరూ విఫలమయ్యారు.
తక్కువ పరుగుల ఛేదనలో...
అనంతరం బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం నుంచే మంచి స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులు, అజింక్యా రహానే 21, అంబటి రాయుడు పన్నెండు పరుగులు చేసి అవుటయ్యారు. అప్పటికే చెన్నై స్కోరు 120 దాటడంతో ఇక విజయం ఎంతో దూరం లేదని అర్థమయింది. కాన్వే 44 పరుగుల వద్ద అవుటయ్యాడు. శివమ్ దూబే సిక్సర్ కొట్టడంతో చెన్నై విజయాన్ని ఇక ఎవరూ ఆలేకపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ముంబయి ఇండియన్స్కు ఓటమి తప్పలేదు. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే చెన్నై విజయం సాధించింది.
Next Story