Fri Nov 22 2024 05:01:54 GMT+0000 (Coordinated Universal Time)
Jammu And Kashmir : నేడు జమ్మూకాశ్మీర్ లో తొలివిడత ఎన్నికలు... గెలిచే అభ్యర్థులు వీరేనట
జమ్మూకాశ్మీర్ లో తొలివిడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
జమ్మూకాశ్మీర్ లో తొలి విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి సారిగా 2014లో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరిగాయి. తర్వాత రాష్ట్రపతి పాలనలోనే ఉంది. అయితే జమ్మూను, కాశ్మీర్ ను రెండు కేంద్ర ప్రాంతాలుగా విభజించడంతో పాటు ఆర్టికల్ 370 రద్దుతో ఈ ఎన్నికలు అత్యంత ఉత్కంఠ భరితంగా జరుగుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం మూడు దశల్లో జమ్మూకాశ్మీర్ లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరగనుంది.
మొత్తం ఓటర్లు...
అయితే అన్ని పార్టీలూ ఎన్నికల్లో ిఇచ్చిన హామీల్లో రాష్ట్ర హోదా కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలు కూడా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర హోదాను కల్పిస్తామని చెబుతున్నాయి. ఈరోజు జరిగే పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిన్న సాయంత్రానికే పోలింగ్ సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ తొలి విడత ఎన్ినకలకు సంబంధించి మొత్తం 24 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఈరోజు వాస్తవానికి 23.27 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది.
మొత్తం 219 మంది అభ్యర్థులు...
కేంద్ర ఎన్నికల కమిషన్ అనేక సార్లు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించి ఓటు యొక్క విశిష్టతను ప్రజలకు వివరించింది. తొలిదశలో పదహారు స్థానాలు కాశ్మీర్ వ్యాలీలో ఉండగా, మరో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు జమ్మూలో ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు, అనంతరం ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. భద్రతాసిబ్బంది ఇరవై నాలుగు గంటలు పహారా కాస్తున్నారు. తొలి విడత జరిగే ఎన్నికల్లో 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరంగా చేశాయి. ప్రజలకు స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పించాయి. మొత్తం మీద జమ్మూకాశ్మీర్ లో తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగియాలని అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. అక్టోబరు 8వ తేదీన కౌంటింగ్ జరగనుంది.
Next Story