Sun Dec 22 2024 10:54:18 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హర్యానా, జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలు
నేడు హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
నేడు హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. జమ్మూకాశ్మీర్ లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించారు. మొత్తం పోలింగ్ అరవై శాతం వరకూ నమోదయింది.
హర్యానాలోనూ...
ఇక హర్యానాలోనూ నేడుఎన్నికల ఫలితాలు జరగనున్నాయి. హర్యానాలో ఒకే దఫా అక్టోబరు 4వ తేదీన ఎన్నికలు జరిగాయి. నేడు ఫలితాలు వెల్లడి కానున్నాయి. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ పోరు హోరా హోరీగా ప్రచారాన్ని అన్ని పార్టీలూ నిర్వహించాయి. నేడు కౌంటింగ్ కావడంతో అందరూ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 90 అసెంబ్లీ స్థానాలు కావడంతో 46 స్థానాలు వచ్చిన పార్టీ అధికారంలోకి వచ్చినట్లే. ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి.
Next Story