Wed Apr 23 2025 16:55:51 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జమ్మూ కాశ్మీర్‌కు మోదీ
జమ్మూ కాశ్మీర్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు

జమ్మూ కాశ్మీర్లో నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. శ్రీనగర్ లో నిర్వహించనున్న మెగా ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. దీంతో భారీ భద్రతను ఏర్పాట్లు చేశారు. జమ్మూ కాశ్మీర్ లో మూడు విడతలుగా జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి నిన్న తొలి దశ ఎన్నిక పూర్తయింది.
ఎన్నికల ప్రచార ర్యాలీలో...
61 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో పట్టు సాధించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉంటుంది. ఇప్పటికే తాము అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల బరిలోకి కమలం పార్టీ దిగింది. ప్రధాని పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు.
Next Story