Sun Dec 22 2024 18:21:46 GMT+0000 (Coordinated Universal Time)
APDC Jobs: ఆంధ్రప్రదేశ్ మంత్రుల పేషీలో పని చేయాలని ఉందా?
ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ 48 సోషల్ మీడియా
ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ 48 సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను ప్రచురించింది. AP ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు / మంత్రుల పేషీలో తాత్కాలిక పని కోసం అర్హత, అనుభవజ్ఞులైన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను 23-09-2024 లోపు సమర్పించవలసి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు www.apdc.ap.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు, విద్యార్హత, వయోపరిమితి, అనుభవం వంటి అర్హత ప్రమాణాలను తనిఖీ చేయాలి.
సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగం కోసం సంబంధిత అనుభవంతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.E/B.tech అర్హతతో ఉద్యోగం లభిస్తుంది. 50వేల రూపాయలు జీతం ఇస్తారు. సోషల్ మీడియా అసిస్టెంట్లుగా ఉద్యోగం పొందాలంటే సంబంధిత అనుభవంతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ ఉండాలి. జీతం 30 వేల రూపాయలుగా నిర్ణయించారు.
పోస్టుల కోసం వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రమాణాల ప్రకారం మీకు ముందస్తు అనుభవం ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవడం మంచిది. రెండు నెలల శిక్షణ వ్యవధి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక www.apdc.ap.gov.inని సందర్శించవచ్చు. అధికారిక వెబ్సైట్లో ప్రస్తుత ఖాళీల కోసం తనిఖీ చేయండి. అవసరమైన నోటిఫికేషన్పై క్లిక్ చేసి, అధికారిక నోటిఫికేషన్ను తనిఖీ చేయండి.

Next Story