Sat Nov 23 2024 07:02:35 GMT+0000 (Coordinated Universal Time)
డైరెక్ట్ ఇంటర్వ్యూ : ఈసీఐఎల్ లో 1625 ఉద్యోగాలు, అప్లై చేయండిలా !
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కాంట్రాక్ట్ పద్ధతిలో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి..
హైదరాబాద్ : భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి సంబంధించి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కాంట్రాక్ట్ పద్ధతిలో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొంది. మొత్తం 1625 ఖాళీలు ఉండగా.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అకడమిక్ మెరిట్, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అర్హత, ఎంపిక విధానం, దరఖాస్తులు వివరాలిలా ఉన్నాయి.
మొత్తం ఖాళీలు : 1625
పోస్టుల వివరాలు: జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
ట్రేడుల వారీగా ఖాళీలు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 814
ఎలక్ట్రీషియన్: 184
ఫిట్టర్: 627
అర్హతలు: మెకానిక్/ఎలక్ట్రీషియన్/ఫిట్టర్ ట్రేడుల్లో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.
వయస్సు : అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.
జీతం : మొదటి ఏడాది నెలకు రూ.20,480, రెండో ఏడాది నెలకు రూ.22,528, మూడో ఏడాది నెలకు రూ.24,780లు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 11, 2022.
Next Story