Fri Nov 22 2024 12:21:08 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి ఉచితంగా డీఎస్సీ శిక్షణ
డీఎస్సీ అభ్యర్థులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
డీఎస్సీ అభ్యర్థులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆరు ఐటీడీఏల్లో, గిరిజనేతరుల ప్రాంతాల్లో రెండు నుంచి మూడు కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సెంటర్లో 150 మంది చొప్పున, మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. అభ్యర్థుల కోచింగ్ కు సంబంధించి ఒక్కో అభ్యర్థికి ప్రభుత్వం పాతికవేల రూపాయలు వెచ్చించనుంది. ఈ ఉచిత శిక్షణ తాలూకు తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఏపీ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏల్లో, గిరిజనేతరుల ప్రాంతాల్లో రెండు లేదా మూడు సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 150 మందికి శిక్షణ ఇస్తారు. మూడు నెలలపాటు సాగే ఈ శిక్షణకు ఒక్కో అభ్యర్థికి రూ.25 వేల వరకు ఖర్చు చేయనుంది. 16,347 పోస్టులను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
Next Story