Mon Dec 23 2024 12:36:30 GMT+0000 (Coordinated Universal Time)
GATE ద్వారా రిక్రూట్మెంట్.. 1,40,000 వరకూ జీతం
NTPC రిక్రూట్మెంట్ 2022: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, NTPC తన తాజా రిక్రూట్మెంట్ డ్రైవ్ కోసం రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనుంది. గేట్ 2022 స్కోర్ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా, NTPC 864 ట్రైనీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసక్తి గల అభ్యర్థులు అర్హత, ఖాళీ వివరాలు, జీతం, దరఖాస్తు దశలను తెలుసుకుని అప్లై చేసుకోవచ్చు.
ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్ ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు నోటిఫికేషన్లో ఎన్టిపిసి పేర్కొంది. తమ సంబంధిత డిగ్రీ కోర్సుల్లో 65% మార్కులకు తగ్గకుండా (రిజర్వ్డ్ కేటగిరీకి 55%) B. టెక్ పూర్తి చేసి, GATE 2022లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించనున్నారు.
నోటిఫికేషన్ అక్టోబర్ 13, 2022న విడుదలైంది
రిక్రూట్మెంట్ అక్టోబర్ 28, 2022న ప్రారంభమవుతుంది
రిక్రూట్మెంట్ రిజిస్ట్రేషన్ నవంబర్ 11, 2022న ముగుస్తుంది
ఎంపికైన అభ్యర్థుల జీతం రూ. 40,000 – రూ. 1, 40, 000 మధ్య ఉంటుంది
జనరల్, EWS, OBC అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 300.
SC, ST, PwBD, మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే
NTPC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
హోమ్‌పేజీలో, రిక్రూట్మెంట్ లింక్ కోసం చూడండి
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను చదవాలి
ఫారమ్‌ను పూరించండి, అవసరమైన పత్రాలను జత చేయండి.
దరఖాస్తు రుసుమును చెల్లించండి
ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్తు అవసరాల కోసం దాని ప్రింట్అవుట్ తీసుకోండి
మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లవచ్చు లేదా కాపీలో ఉన్న నోటిఫికేషన్‌ను చూడవచ్చు.
Next Story