Mon Dec 23 2024 04:13:26 GMT+0000 (Coordinated Universal Time)
డీలా పడకండి: 39 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి,Jobs in INDIA
ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ రావడం లేదని అసలు డీలా పడకండి
ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ రావడం లేదని అసలు డీలా పడకండి. ఒక్క ప్రభుత్వ సెక్టార్ లో మాత్రం జాబ్స్ కావాలని వేచి చూస్తున్న వారికి కాకుండా.. ఇతర డిపార్ట్మెంట్స్ లో ఎదురుచూస్తున్న వారి కోసం వచ్చే ఏడాది చాలానే ఉద్యోగాలు ఎదురుచూస్తూ ఉన్నాయి. స్థూల ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, 2024 సంవత్సరంలో ఫ్రంట్‌లైన్ కార్మికులకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రంట్‌లైన్ వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన 'బెటర్‌ప్లేస్' నివేదిక ప్రకారం, 2024 మొదటి అర్ధ భాగంలో దాదాపు 39 లక్షలు లేదా 3.9 మిలియన్ ఉద్యోగాలు రావచ్చు.
మిలియన్ డేటా పాయింట్ల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది 'బెటర్‌ప్లేస్'. కొత్త శ్రామిక శక్తి మొత్తం అవసరంలో 50 శాతానికి పైగా లాజిస్టిక్స్, మొబిలిటీ పరిశ్రమల నుండి వస్తుందని అంచనా వేసింది. అత్యధిక ఉద్యోగాలు ఇ-కామర్స్, IFM, ఐటీ విభాగాల్లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 2024లో అతి తక్కువ నియామకాలు BFSI (0.87 శాతం), రిటైల్, QSR (1.96 శాతం) నుండి వస్తాయని అంచనా వేశారు. కార్మికులకు అధిక డిమాండ్ మధ్య జీతాలు స్థిరీకరించడం ప్రారంభించడంతో లాజిస్టిక్స్, మొబిలిటీలో కూడా మంచి జీతాలు కూడా ఉండనున్నాయి. జీతంలో అత్యధిక పెరుగుదల తయారీ (19.6 శాతం) లో ఉండనుందని అంచనా వేస్తున్నారు.
Next Story