Sun Nov 17 2024 17:49:45 GMT+0000 (Coordinated Universal Time)
జాబ్స్: కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఉద్యోగాలు
భారతదేశంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నిపుణుల కోసం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు
భారతదేశంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నిపుణుల కోసం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఔత్సాహిక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ల కోసం, భారత ప్రభుత్వ రంగం అనేక కెరీర్ అవకాశాలను అందిస్తుంది. నైపుణ్యం కలిగిన IT నిపుణుల కోసం నానాటికీ పెరుగుతున్న డిమాండ్ కారణంగా.. ప్రభుత్వ సంస్థలు CSE ఇంజనీర్లకు అవకాశాలు ఇవ్వాలని సిద్ధమయ్యాయి.
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI), డెహ్రాడూన్
ఉద్యోగం: సీనియర్ సాఫ్ట్ వేర్ డెవలపర్
FSI రిక్రూట్మెంట్ 2023 ప్రకారం.. సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్లకు జీతం ₹1,00,000/-తో పాటు HRA కూడా ఉంటుంది.. టెక్నికల్ అసోసియేట్లకు ₹37,000/-తో పాటు HRA వేతనాలను అందిస్తుంది. అర్హతల ప్రకారం.. సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్లకు గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలి.. టెక్నికల్ అసోసియేట్లకు 30 సంవత్సరాలు, నిర్దిష్ట విద్యార్హతలు ఉండాలి. అటవీ వనరుల అంచనా కోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అనుభవం ఉంటే మంచిది. ఎంపిక ప్రక్రియలో అర్హతలు, అనుభవం, వయో పరిమితి ప్రమాణాల ఆధారంగా షార్ట్-లిస్టింగ్ ఉంటుంది.. తర్వాత FSI, డెహ్రాడూన్‌లో పరీక్ష/ఇంటర్వ్యూ ఉంటుంది.
అప్ప్లై చేయడానికి చివరి తేదీ: 05/12/2023
సూచనలు:
1. వాక్ ఇన్ టెస్ట్‌కు అర్హులైన అభ్యర్థులకు ఇమెయిల్/ఫోన్ ద్వారా తెలియజేస్తారు.
2. విద్యార్హత, వాక్-ఇన్ టెస్ట్/ఇంటర్వ్యూ సమయంలో అనుభవానికి సంబంధించిన సర్టిఫికేట్లతో పాటు వాక్-ఇన్ పరీక్ష సమయంలో చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం ఆమోదించిన ఫోటో ID కార్డ్‌ని తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది.
3. ఒక వ్యక్తి అతని/ఆమె విద్యార్హతలు, ప్రకటనలో ఇచ్చిన అర్హత ప్రమాణాలను బట్టి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి.
Next Story