Sun Dec 22 2024 18:10:01 GMT+0000 (Coordinated Universal Time)
ITBP లో పలు ఉద్యోగాలు.. లక్ష వరకూ జీతం
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ పలు ఉద్యోగాలకు సంబంధించి
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) పలు ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ను ప్రకటించింది. ఎడ్యుకేషన్ స్ట్రెస్ కౌ,న్సెలర్ పాత్రలలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ను ప్రకటించింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో దేశవ్యాప్తంగా 112 ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మగవాళ్లకు 96 స్థానాలు, మహిళా అభ్యర్థులకు 16 స్థానాలు ఉన్నాయి.
ఇక ITBP హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్) కోసం దరఖాస్తు ప్రక్రియ 7 జూలై 2024న ప్రారంభమై 5 ఆగస్టు 2024న ముగిసింది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) టెలికమ్యూనికేషన్ విభాగంలో 526 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సై పోస్టులకు 20-25 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్లు ఉండాలి. రూ.35,400-1,12,400 మధ్య జీతం ఉంటుంది. దరఖాస్తు కోసం recruitment.itbpolice.nic.in లింక్ పై క్లిక్ చేయండి.
ITBP హెడ్ కానిస్టేబుల్ రాత పరీక్షలో బహుళ-ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. పరీక్షను పూర్తి చేయడానికి అభ్యర్థులకు 2 గంటల సమయం ఉంటుంది. 100 మార్కులకు గానూ 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
Next Story