Sun Dec 22 2024 23:21:56 GMT+0000 (Coordinated Universal Time)
Jobs In AP: ఏపీలో 400కు పైగా ఉద్యోగాలకు జాబ్ ఫెయిర్.. ఎప్పుడంటే?
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ (DET), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ (DET), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో నిరుద్యోగుల కోసం జూలై 9, 2024న జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా రామచంద్రపురంలోని సిద్ధార్థ ITI కళాశాలలో జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం రూ. 8,000 నుండి రూ. 22,000 వరకూ ఉంటుంది. మొత్తం పోస్ట్లు 415 ఉన్నాయి. అర్హత విషయానికి వస్తే 10వ తరగతి/ ఇంటర్మీడియట్/ ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. వయసు 18-29 మధ్య ఉండాలి.
జూలై 9న అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో అంజనాస్ ఫౌండేషన్, గ్రామీణ యువజన వికాస సమితి అనే రెండు సంస్ధలు జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. ఈ జాబ్ మేళాలో మొత్తం 7 సంస్ధలు పాల్గొంటున్నాయి. మొత్తం 800 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ జాబ్ మేళాకు హాజరవుతున్న సంస్ధల్లో అపోలో ఫార్మసీ, టాటా టెక్నాలజీస్, షిండ్లర్ ఎలక్ట్రిక్, సుప్రజిత్ ఇంజనీరింగ్, మదర్సన్ సుమీ సిస్టమ్స్, యాంఫెనాల్, రిలయన్స్ డిజిటల్ వంటి సంస్ధలు ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమో చేసిన వారు ఉద్యోగాలకు అర్హులు. విజయవాడ, గుడివాడ, గుంటూరు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఉద్యోగాలు ఇస్తారు.
Next Story