Fri Nov 22 2024 18:17:54 GMT+0000 (Coordinated Universal Time)
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా ఉద్యోగావకాశాలు
18 నుంచి 30ఏళ్ల వయసు ఉన్న ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐటీఐ పూర్తి చేసిన వారు
Jobs:ఏలూరులో జాబ్ మేళాను నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న రీజనల్ జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గంటా సుధాకర్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని మార్గాని ఎస్టేట్‌లో జాబ్ మేళాలో ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన నిరుద్యోగులు పాల్గొనవచ్చని సూచించారు. సుమారు 100కు పైగా కంపెనీల్లో దాదాపు 5 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు సెల్ 9666322032, 9652503799 లేదా టోల్ ఫ్రీ నంబర్ 9988853335లో సంప్రదించాలని కోరారు.
చీపురుపల్లి ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డా.పీవీ కృష్ణాజీ తెలిపారు. ఈ మేళాకు 14 ప్రముఖ కంపెనీలు హాజరవుతాయన్నారు. 18 నుంచి 30ఏళ్ల వయసు ఉన్న ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐటీఐ పూర్తి చేసిన వారు ఈ మేళాకు హాజరుకావచ్చు. ఆన్లైన్ నమోదు రిఫరెన్సుతో పాటు ఇతర విద్యార్హత ధ్రువపత్రాలు, ఒరిజినల్, జిరాక్సులతో సహా ఫిబ్రవరి 29న ఉదయం 9 గంటలకు కళాశాలలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఈ మేళా నిర్వహిస్తున్నాయి. ఇతర వివరాల కోసం 9010023033, 728042743 నెంబర్లకు గానీ, టోల్‌ఫ్రీ నెంబరు 9988853335కు సంప్రదించండి.
Next Story