Sun Dec 22 2024 18:21:54 GMT+0000 (Coordinated Universal Time)
Jobs: గుడ్ న్యూస్.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
దేశంలోని ప్రభుత్వ రంగ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
దేశంలోని ప్రభుత్వ రంగ ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) హైదరాబాద్ క్యాంపస్‌లో వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూకు ఆహ్వానించింది. మొత్తం 17 ఉద్యోగాలు కాగా.. అందులో CMM ఇంజనీర్ (4 ఓపెన్ పోస్టులు), మిడిల్ స్పెషలిస్ట్ (8 పోస్ట్‌లు), ఏవియానిక్స్ విభాగంలో జూనియర్ స్పెషలిస్ట్ (5 పోస్ట్‌లు) ఉన్నాయి. హైదరాబాద్‌లోని హెచ్ఏఎల్లో స్వల్పకాలిక కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగాల కోసం ఈ నియామకం చేపట్టారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 24, 2024 అని నిర్వాహకులు తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల ఫీజుగా రూ. 500 చెల్లించాలి. SC, ST, PWBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అధికారిక వెబ్‌పేజీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) స్పెషాలిటీ ఆఫ్ రేడియాలజీ, అల్ట్రాసోనోగ్రఫీలో విజిటింగ్ కన్సల్టెంట్ పోస్ట్ కోసం ఆసక్తిగల అర్హతగల అభ్యర్థుల కోసం వెతుకుతోంది. ఇందులో ఒక ఖాళీ మాత్రమే అందుబాటులో ఉంది. HAL రిక్రూట్మెంట్ 2024 కోసం పరిగణలోకి తీసుకోవాలంటే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 65 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. అభ్యర్థులు MBBS+MD రేడియాలజీ/ DNB రేడియాలజీ/ DMRE/ DMRD కలిగి ఉండాలి. అభ్యర్థులు వారి సంబంధిత రంగంలో కనీసం 05 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
Next Story