Sun Dec 22 2024 23:24:11 GMT+0000 (Coordinated Universal Time)
Nursing Jobs in Germany:జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు.. 21-38 మధ్య వయసు వారికి సువర్ణావకాశం
జర్మనీలో ఉపాధి అవకాశాల కోసం అర్హత కలిగిన నర్సింగ్ సిబ్బందికి శిక్షణ, నియామకం లక్ష్యంగా
Nursing Jobs in Germany:తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ట్రిపుల్ విన్ ప్రాజెక్ట్ కింద జర్మనీలో ఉపాధి అవకాశాల కోసం అర్హత కలిగిన నర్సింగ్ సిబ్బందికి శిక్షణ, నియామకం లక్ష్యంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం జర్మన్ ఫెడరల్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీ (BA), జర్మన్ ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (GIZ) సమన్వయంతో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నర్సింగ్ ఉద్యోగావకాశాల కోసం అభ్యర్థులకు ఓ క్లారిటీ ఇవ్వడం.. విదేశీ అవకాశాలపై వివరణలు ఇచ్చేందుకు TOMCOM మార్చి 11వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మినీ ఆడిటోరియం, గాంధీ మెడికల్ కాలేజీ, ముషీరాబాద్ లో అవగాహన కార్యక్రమం, ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు.
21 నుండి 38 సంవత్సరాల వయస్సు ఉన్న B.Sc (నర్సింగ్), GNM అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు భాషా ప్రావీణ్యంలో రెసిడెన్షియల్ శిక్షణ పొందుతారు. సంబంధిత రంగంలో రాణించడానికి అవసరమైన అదనపు వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. TOMCOM ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు వారి రెజ్యూమ్, సంబంధిత డాక్యుమెంట్లతో డ్రైవ్‌కు హాజరు కావాలని ఆహ్వానించింది. మరిన్ని వివరాల కోసం, www.tomcom.telangana.gov.inని సందర్శించండి. ఫోన్ లో 9908830438/6302292450/8919047600/7901290580ని సంప్రదించండి.
Next Story