Sun Apr 27 2025 15:09:10 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్: LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
జూలై 25న దరఖాస్తుల నమోదు ప్రారంభమైంది. ఈ ఉద్యోగాల కోసం

LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) లో జూనియర్ అసిస్టెంట్ స్థానాల్లో ఖాళీలు ఉన్నాయని ప్రకటన వచ్చింది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో 200 ఖాళీలను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ స్థానాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
జూలై 25న దరఖాస్తుల నమోదు ప్రారంభమైంది. ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14 ఆగస్టు 2024. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. అర్హత, దరఖాస్తు ప్రక్రియ, ముఖ్యమైన తేదీలపై సమగ్ర సమాచారం కోసం వివరణాత్మక LIC HFL జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను డౌన్లోడ్ చేసుకోండి. దీనికి విద్యార్హత డిగ్రీ. జీతం: Rs. 32000 నుండి Rs.35,200 వరకూ ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష సెప్టెంబర్ నెలలో ఉంటుంది.
భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలను కలిగి ఉండాలి. సర్టిఫికేట్, డిప్లొమా లేదా కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసి ఉండాలి. హైస్కూల్ లేదా కాలేజీలో కంప్యూటర్/ఐటీని సబ్జెక్టుగా చదివి ఉండాలి. 01 జూలై 2024 నాటికి, అభ్యర్థులు 21 మరియు 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. LIC జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ దరఖాస్తు రుసుము 800 రూపాయలు కాగా.. అదనంగా 18% GST ఉంటుంది. ఈ రుసుము తిరిగి చెల్లించరు. దరఖాస్తు ప్రక్రియ సమయంలో ఆన్లైన్లో చెల్లించాలి.
https://www.lichousing.com/job-opportunities
Next Story