Wed Nov 13 2024 00:59:56 GMT+0000 (Coordinated Universal Time)
రైల్వేలో ఉద్యోగాలు.. ఏకంగా 5,647 పోస్టులలో అవకాశాలు
నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీకి
నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అవసరమైన అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు నార్త్ ఫ్రాంటియర్ రైల్వే అధికారిక వెబ్సైట్ nfr.indianrailways.gov.in సందర్శించి దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించవచ్చు. దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 3, 2024 గా నిర్ణయించారు.
వివిధ కేటగిరీల్లో 5,647 పోస్టులకు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ జరుగుతోంది. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించే ముందు నోటిఫికేషన్ PDFని తనిఖీ చేయాలని సూచించారు. కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై, సంబంధిత రైల్వే ట్రేడ్‌లో ITI సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థులు అర్హులని తెలిపింది. 15-24 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 4 నుంచి డిసెంబర్ 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ) & మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ (రేడియాలజీ): ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో కనీసం 50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణత (10+2 సిస్టమ్ కింద) సాధించి ఉండాలి.
అన్ని ఇతర పోస్టులు: కనీసం 50% మార్కులతో మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన (10+2 సిస్టమ్ కింద) చదువు పూర్తీ చేసి ఉండాలి
వయోపరిమితి: 15 ఏళ్లలోపు నుండి 24 ఏళ్లకు మించకూడదు
దరఖాస్తు రుసుము:
రూ. 100/- మాత్రమే ఆన్లైన్లో చెల్లించాలి. రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుమును కట్టాల్సిన అవసరం లేదు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయండి.
Next Story