Mon Nov 04 2024 18:26:47 GMT+0000 (Coordinated Universal Time)
జాబ్స్ వచ్చేశాయ్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్
నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది.
నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) త్వరలో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విండోను మూసివేయనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ sbi.co.in/web/careersలో ఖాళీల కోసం డిసెంబర్ 7, 2023 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) మొత్తం 8283 ఖాళీలను భర్తీ చేయడం ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ లక్ష్యం. ఇది రెండు దశల్లో జరుగుతుంది: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ను జనవరి 2024లో, మెయిన్ ఎగ్జామినేషన్‌ను ఫిబ్రవరి 2024లో నిర్వహించాలని నిర్ణయించారు.
అర్హతలు:
వయోపరిమితి: ఏప్రిల్ 1, 2023 నాటికి 20 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు.. 28 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వ్ చేసిన కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన అర్హత.
దరఖాస్తు రుసుము:
జనరల్/అన్ రిజర్వ్డ్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు రూ. 750 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉండగా.. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్ఎం/డీఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
జూనియర్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి దశలు:
sbi.co.inలో SBI కెరీర్ పేజీని సందర్శించండి
హోమ్‌పేజీలో, జూనియర్ అసోసియేట్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఫారమ్‌ను పూరించండి, రుసుము చెల్లించి, ఫారమ్‌ను సమర్పించాలి
దరఖాస్తును డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోండి
Next Story