Fri Nov 22 2024 16:44:27 GMT+0000 (Coordinated Universal Time)
పోలీసు ఉద్యోగాలకు ఊహించని డిమాండ్.. ఎంత మంది అప్ప్లై చేసుకున్నారంటే
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా పోలీసు శాఖలోని ఎస్ఐ, కానిస్టేబుళ్ళ పోస్టులతో పాటు రవాణా, ఎక్సైజ్, ఫైర్, జైళ్ళ శాఖలలోని ఖాళీల భర్తీకి
నిరుద్యోగ యువత ఎన్నో రోజులుగా ఎదురుచూసిన నోటిఫికేషన్స్ రానే వచ్చేసాయి. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా పోలీసు శాఖలోని ఎస్ఐ, కానిస్టేబుళ్ళ పోస్టులతో పాటు రవాణా, ఎక్సైజ్, ఫైర్, జైళ్ళ శాఖలలోని ఖాళీల భర్తీకి వరుస నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మొత్తం 17 వేల పైచిలుకు పోస్టుల కోసం టీఎస్ఎల్పీఆర్బీ దరఖాస్తులను ఆహ్వానించగా, మంగళవారం నాటికి దాదాపు ఏడున్నర లక్షల దరఖాస్తులు అప్లోడ్ అయినట్లు తెలుస్తోంది. పోలీసు శాఖలోని ఉద్యోగాల కోసమే దాదాపు నాలుగున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. 2018 లో రాష్ట్ర పోలీసు శాఖ 16 వేల పై చిలుకు ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా దాదాపు ఏడున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి గతంలో వచ్చిన దరఖాస్తుల కంటే ఎక్కున దరఖాస్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల ప్రకారం.. 48 శాతం మంది అభ్యర్థులు ఒక్క పోస్టుకు దరఖాస్తు చేసుకోగా, 29 శాతం మంది రెండు పోస్టులకు, 17 శాతం మంది మూడు పోస్టులకు, నాలుగు శాతం మంది నాలుగు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 68 శాతం మంది తెలుగు, 32 శాతం మంది ఇంగ్లీషును ఎంపిక చేసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి 29 శాతం దరఖాస్తులు రాగా, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, నారాయణపేట, సిరిసిల్ల జిల్లాలనుంచి కేవలం ఒక్క శాతం దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకునేందుకు 20 వ తేదీ శుక్రవారం వరకు గడువు ఉంది. మొత్తంగా తొమ్మిదిన్నర లక్షల వరకు దరఖాస్తులు అందవచ్చని అంచనా వేస్తున్నారు. ఆగస్టు నెలలో ప్రిలిమినరీ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలలో అభ్యర్థుల ఫేస్, అర చేయి బయో మెట్రిక్, డిజిటల్ సైన్ తీసుకునేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 20 తో ముగియనున్న నేపథ్యంలో 21వ తేదీ నుంచి డేటా సెంట్రలైజ్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని బోర్డు అధికారులు తెలిపారు.
అర్హత గల అభ్యర్థులు https://www.tslprb.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
News Summary - telangana police department new notifications si, conistable excise fire department jobs notification
Next Story