Tue Nov 05 2024 16:35:22 GMT+0000 (Coordinated Universal Time)
Maha Shivaratri : అభిషేక ప్రియుడైన శివుడిని మహా శివరాత్రి రోజున ఎలా పూజించాలి ?
లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధజలంతో, ఆవుపాలతో, పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో, పుష్పాలతో అభిషేకం..
మహా శివరాత్రి.. దీనినే శివరాత్రి.. శివుని యొక్క మహారాత్రిగా పిలుస్తారు. ఏడాదంతా శివుడిని స్మరించకపోయినా.. ఈ ఒక్క రోజు "ఓం నమః శివాయ" అని శివనామస్మరణ చేస్తే.. ఆ తండ్రి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి రోజున శివుడికి కొన్ని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ పర్వదినం రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి.. ఇల్లంతా శుభ్ర పరచుకుని.. తలస్నానం చేయాలి. పూజగదిని శుభ్రం చేసుకుని.. గుమ్మాలకు తోరణాలను అలంకరించుకోవాలి.
లింగాకారంలో ఉన్న శివునికి శుద్ధజలంతో, ఆవుపాలతో, పంచామృతంతో వివిధ పూజా ద్రవ్యాలతో, పుష్పాలతో అభిషేకం చేయాలి. ముఖ్యంగా ఈరోజున మారేడు దళాలు, బిల్వ పత్రాలు, తుమ్మిపూలు, గోగుపూలు, తెలుపు రంగు పూలతో శివ పంచాక్షరీ మంత్రాన్ని స్మరిస్తూ పూజించడం వల్ల.. శివానుగ్రహం కలుగుతుంది. శివునికి నైవేద్యంగా తాంబూలం, చిలకడదుంప, అరటిపండు, జామపండు, ఖర్జూరపండ్లను సమర్పించి.. శివ అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి. ప్రాతఃకాలం నుండి ఉదయం 9 గంటలలోపు శివపూజ , శివునికి అభిషేకాలు చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
ముఖ్యంగా.. శివుడు అభిషేక ప్రియుడని చెప్తారు. ఆ లయకారుడికి నీటితో అభిషేకం చేసినా.. పొంగిపోతాడు. అందుకే ఆయనను భోళాశంకరుడని అంటారు. చతుర్థశి అర్థరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం. ఆ మయంలో శివనామస్మరణ, శివునికి అభిషేకం చేస్తే.. పునర్జన్మ ఉండదని ప్రతీతి.
Next Story