Sun Dec 22 2024 12:40:51 GMT+0000 (Coordinated Universal Time)
Exit Polls : మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే
మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి. సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి
మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయి. పోలింగ్ ముగియనుండటంతో వివిధ జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీస్థానాలున్నాయి. ఇందులో మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ సరవే ప్రకారం, మహాయుతి 150 నుంచి 170 స్థానాల్లోనూ, మహా వికాస్ అఘాడీ 110 నుంచి 130 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని తెలిపింది. ఇతరులు ఎనిమిది నుంచి పది స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని తేల్చిచెప్పింది.
వివిధ సంస్థల సర్వే ప్రకారం...
మహారాష్ట్ర మ్యాజిక్ ఫిగర్ 146 గా ఉంది. రిపబ్లిక్ ప్రీ మార్క్ సర్వే ప్రకారం మహారాష్ట్రలో మహాయుతికి 137 నుంచి 157 స్థానల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. మహావికాస్ అఘాడీ 126 నుంచి 140 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని చెప్పింది. ఇతరులు రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో గెలుస్తారని తేల్చింది.జార్ఖండ్ లో ఎన్డీఏ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. ఎన్డీఏ 42 నుంచి 47 స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చింది. కాంగ్రెస్ కూటమి ఇరవై నుంచి ముప్ఫయి స్థానాలకే పరమితమవుతుందని చెప్పింది. జార్ఖండ్ లో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 41గా ఉంది.
Next Story