Sun Dec 14 2025 18:20:31 GMT+0000 (Coordinated Universal Time)
సిద్దిపేట జిల్లాలో ఉద్రిక్తత.. లాఠీఛార్జి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానని భూనిర్వాసితులు ముట్టడించారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానని భూనిర్వాసితులు ముట్టడించారు. అక్కడ ఉన్న టీఆర్ఎస్ నేతలపై దాడికి దిగారు. గౌరెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ ను నిలిపేయాలంటూ రెండు రోజులుగా గుడాటిపల్లి భూనిర్వాసితులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు.
ఆందోళనకు దిగిన...
అయితే అక్కడకు టీఆర్ఎస్ ప్రతినిధులు చేరుకోవడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ సందర్బంగా హుస్నాబాద్ ఏసీపీ సతీష్ కు కూడా గాయాలయ్యాయి. పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులు చెదరగొట్టారు. ఈ సందర్భంగా పలువురు స్పృహతప్పి పడిపోయారు.
Next Story

