Fri Dec 20 2024 19:14:52 GMT+0000 (Coordinated Universal Time)
అర్థరాత్రి అరెస్ట్ లు.. పరిస్థితి ఉద్రిక్తం
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కన్నపేట మండలం గూడాటి పల్లిలో రైతులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కన్నపేట మండలం గూడాటి పల్లిలో రైతులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. గౌరెల్లి ప్రాజెక్టుకు ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు సిద్దమవువుతండగా రైతులు ఆందోళనకు దిగారు. ట్రయల్ రన్ ను అడ్డుకుంటున్నారన్న కారణంగా రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
గౌరెల్లి భూనిర్వాసితులను....
గౌరెల్లి భూనిర్వాసితులను ఆదుకోకుండానే గౌరెల్లి ప్రాజెక్టుకు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారన్నారు. అయితే భూ నిర్వాసితులను నిన్న అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసి సిద్ధిపేట జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల కు తరలించారు. పోలీసులపై భూనిర్వాసితులు తిరగబడటంతో స్వల్పంగా లాఠీ ఛార్జీ జరిగింది. గూడాటిపల్లిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ అనుమతించడం లేదు.
Next Story